ఉద్రిక్తతల సమయంలో ఆటవిడుపు... సాంబ రిలీఫ్ క్యాంప్ లో క్రికెట్ ఆడిన సీఎం ఒమర్ అబ్దుల్లా

  • జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో సహాయక శిబిరాల ఏర్పాటు
  • సాంబ శిబిరం వద్ద బాలుడితో క్రికెట్ ఆడిన ఒమర్ అబ్దుల్లా
  • శిబిరాల్లో ఆహారం, వైద్యం అందిస్తున్నామన్న సీఎం
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. నిన్న రాత్రి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో... పాకిస్థాన్ షెల్లింగ్ కారణంగా నష్టపోయిన జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల పౌరుల కోసం అక్కడి ప్రభుత్వం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సాంబలోని సహాయక శిబిరంలో పర్యటించి, అక్కడ ఓ చిన్నారితో క్రికెట్ ఆడుతూ కొంత రిలాక్స్ అయ్యారు. బాధితులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల గురించి విలేకరులతో మాట్లాడుతూ, శిబిరాల్లో ఉంటున్నంత కాలం పౌరులు తక్కువ సమస్యలను ఎదుర్కొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 

"మేము చేయగలిగినదంతా చేస్తున్నాం. రోజుకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నాం, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, అన్ని శిబిరాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం... ఇక్కడ ఉండటం వల్ల వారు సాధ్యమైనంత తక్కువ సమస్యలను ఎదుర్కొనేలా చూస్తున్నాం" అని ఆయన వివరించారు. అంతకుముందు, పూంచ్‌లో జరిగిన పాకిస్థాన్ షెల్లింగ్‌లో గాయపడిన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లారు.

Omar Abdullah
Jammu and Kashmir
Cricket
Pakistan shelling
Border tensions
Relief camp
Samba
India-Pakistan conflict
Chief Minister
Jammu

More Telugu News